ఎన్నికల సమయం దగ్గరుపడుతున్న వేళ వైసీపీకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. జిల్లాల్లోని ఇద్దరు లేదా ముగ్గురు నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమలలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి శమంతకమణి, ఆమె కొడుకు అశోక్.
కొద్దిరోజులుగా వైసీపీలో నేతలిద్దరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు. సింగనమల వైసీపీ టికెట్‌ను శమంతకమణి, ఆమె కుమారుడు ఆశించారు. కానీ పాతవారికి జగన్ టికెట్ కేటాయించడంతో రగిలిపోయారు. అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రెండురోజుల కిందట ఆమె కూతురు యామిని బాలా వైసీపీకి బైబై చెప్పారు. ఇప్పుడు శమంతకమణి ఆమె కొడుకు అశోశ్ వంతైంది.