అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో కొన్ని కీలక సన్నివేశాల కోసం అనుష్క 60 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ‘ఘాటీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అనుష్క ఈ మూవీతో పాటు ‘కథనార్-ది వైల్డ్ సోర్సెరర్’ అనే మలయాళ సినిమాలోనూ నటిస్తున్నారు.