ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం చాలా కష్టమన్నారు. దానికి జగన్ అనుసరిస్తున్న నియంత పాలనే కారణమని వెల్లడించారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త పీకే సీఎం జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో జగన్ ఒక్క అభివృద్ధి పనిని కూడా ప్రారంభించలేదని ఆరోపించారు. ఇది జగన్ ఓటమికి ప్రాధాన కారణమన్నారు.
గడిచిన ఐదేళ్లో సీఎం జగన్ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆయన ప్రొవైడర్ మోడ్ లోనే ఉండి.. చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టారని ప్రశాంత్ కిశోర్ జగన్ పరిపాలనా తీరుపై విమర్శలు గుప్పించారు.
జగన్ పాలనలో అనేక తప్పిదాలు జరిగాయన్నారు. జగన్ ప్రజలకు డబ్బులు మాత్రమే పంచి పెట్టారని.. యువతకు ఎటువంటి ఉద్యోగాలు కల్పించలేదని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బుఘేల్ మాదిరిగానే జగన్ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించారని పేర్కొన్నారు.