ప్రముఖ AI కంపెనీ Perfection42 సీఈఓ సిమోనా వాసైట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో AIతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కృత్రిమ మేధస్సు (AI) సాధనాల ద్వారా సృష్టించబడిన డీప్‌ఫేక్‌లు పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని అన్నారు. దీనిని నియంత్రించకపోతే “ప్రజాస్వామ్యానికి ముప్పు” కలిగిస్తుందని హెచ్చరించారు.