పెన్షన్ల పంపిణీపై ఈసీ మార్గదర్శకాలు జారీ..

పెన్షన్‌ పంపిణీపై ఏపీ ప్రభుత్వం స‌వ‌రించిన విధివిధానాలు జారీ చేసింది. ఈసీ సూచించిన విధంగా మార్గదర్శకాలు రూపొందించింది. బుధవారం మ‌ధ్యాహ్నం నుంచి ఏప్రిల్ 6 లోగా పెన్షన్ల పంపిణీ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

 

కేట‌గిరీలవారీగా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. కొంత‌ మందికి ఇంటివద్ద న‌గదు పంపిణీ, మిగిలిన వారికి గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల వ‌ద్ద పంపిణీకి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

 

దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డేవారు, అస్వస్థతకు గురైన‌వారు, మంచాన‌ ప‌డినవారు, వృద్ధ వితంతువుల‌కు ఇంటి వ‌ద్దే పంపిణీ చేయాల‌ని నిర్ణయం తీసుకుంది. గ్రామ స‌చివాల‌యాల‌కు చాలా దూరంగా ఉన్న వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

 

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 27 వేల మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే బీఎల్వోలుగా సచివాలయ సిబ్భందికి ఎన్నికల విధులు అప్పగించిన ప్రభుత్వం.. స‌రిప‌డా సిబ్బంది లేక‌పోవ‌డంతో రెండు కేట‌గిరీలుగా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీ స‌మ‌యంలో ఉద‌యం 9 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కూ స‌చివాల‌యాలు ప‌నిచేయాల‌ని ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *