భారతీయ పర్యాటకులకు జపాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయులు సహా భారత్‌లో నివసించే విదేశీయులకు వీసా ప్రక్రియను సులభతరం చేస్తూ ఈ-వీసా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వీఎఫ్ఎక్స్ గ్లోబల్ నిర్వహించే అప్లికేషన్ సెంటర్ల దగ్గర దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో వీసా మంజూరు అవుతుంది. ఫోన్‌కు వచ్చే ‘వీసా ఇష్యూయెన్స్ నోటీసు’ను ఎయిర్‌పోర్టు సిబ్బందికి చూపిస్తే సరిపోతుంది.