తప్పుదోవ పట్టించిన యాడ్స్ కేసులో భాగంగా బాబా రాందేవ్, పతంజలి ఎండీ బాలకృష్ణ నేడు సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. క్షమాపణలు తెలియజేస్తూ పతంజలి సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రీం స్పందిస్తూ.. ‘మీ క్షమాపణలతో మేం సంతృప్తి చెందలేదు’ అని వ్యాఖ్యానించింది. రాందేవ్, బాలకృష్ణ వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని వాళ్ల తరపు లాయర్ తెలిపారు. చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేసింది.