అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, మంగళవారం చిత్రబృందం ఫాన్స్ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పంచుకుంది. ‘పుష్ప ది రూల్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు.