సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో ఇన్సెంట్ ఎనర్జీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ను కృష్ణ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ధ్యానం అనేది అత్యంత శక్తివంతమైనది ధ్యానం ద్వారా మనం ఏది అనుకుంటే అది సాధించవచ్చునని కొనియాడుతూ ఈ యొక్క సదాశివపేట పట్టణంలో మరియు ప్రతి మండలంలో పిరమిడ్ ఆకృతిలో గ్రంథాలయాల నిర్మాణల ఏర్పాటుకు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ప్రజల్లో సంపూర్ణమైన ప్రశాంతతను పిరమిడ్ ధ్యానం ద్వారానే నెలకొల్ప వచ్చునని పిరమిడ్ ధ్యానుల సమక్షంలో తెలియజేశారు. అదేవిధంగా త్వరలోనే సదాశివపేట పట్టణం సిద్ధాపూర్ గ్రామంలో 180/180 మెగా పిరమిడ్ నిర్మాణ పనులు కొనసాగుతాయని అందుకు ధ్యానులందరూ తమ బాధ్యత వహించి పత్రీజీ గారి ఆశయాల కోసం నిరంతరం కృషి చేయాలని, పట్టుదలతో కష్టపడాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రచారక గౌరవ అధ్యక్షులు కరాటే మాస్టర్ అశోక్, రాయపాడు పిరమిడ్ కేంద్రం ధ్యానులు ప్రకాష్ మాస్టర్, సంగీత మాస్టర్, సంగప్ప మాస్టర్, విష్ణు మాస్టర్, రిపోర్టర్ రాజు, మరియు సదాశివపేట పట్టణ ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.