పుట్టిన రోజు నాడే ఓ చిన్నారికి నూరేళ్లు నిండి పోయాయి. ఆ చిన్నారి బర్త్ డే కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన కేక్ తనడం వల్లన అస్వస్థకు గురై ప్రాణాలు విడిచింది. కేక్ విషపూరితం కావడంతో ఆ చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషాదకర ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది.
మార్చి 24 న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కథనం మేరకు.. పంజాబ్ లోని పటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారికి ఈ నెల 24 బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఓ బ్యాకరీ నుంచి ఆన్ లైన్ లో కేకును ఆర్డర్ చేశారు. సాయంత్రం ఏడు గంటలకు కేక్ కట్ చేసి.. కుటుంబ సభ్యులంతా పుట్టిన రోజు వేడుకను ఎంతో ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటూ కేకును తిన్నారు. రాత్రి పది గంటల సమయంలో కేక్ తిన్న వాళ్లందరూ అస్వస్థకు గురయ్యారు.
ఇక ఆ చిన్నారి గొంతు తడారిపోతుందంటూ మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయం నిద్రలేచేసరికి చిన్నారి మాన్వికి ఆరోగ్యం క్షీణించడంతో హుటా హుటినా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో వైద్యులు ఎంత ప్రయత్నించిన ఆ చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. కేకు విషపూరితం కావడం వల్లే మాన్వి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం దర్యాప్తులో భాగంగా మృతిదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు ,కేకు నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపారు. ఫలితాలు రావాల్సి ఉందని, నివేదిక ఆధారంగా నిందుతుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.