అనకాపల్లి జిల్లా మాడుగుల టీడీపీలో టికెట్ వార్ చోటు చేసుకుంది. ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం మాడుగుల టికెట్ కేటాయించింది. దాంతో మాజీ ఎమ్మెల్యే రామానాయుడు బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఆదివారం నాలుగు మండలాల్లో బైక్ ర్యాలీ, సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే రామానాయుడు వైసీపీ నేతలకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.