ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కదిరి టికెట్ ఆశించిన చాంద్ భాషాకు అధిష్టానం మొండిచెయ్యి చూపింది. దాంతో పార్టీని వీడుతున్నట్లు సమాచారం