మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారాహిల్స్ పీఎస్ లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ పై ఆయన అసత్య ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు శుక్రవారం వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును బంజరాహిల్స్ పీఎస్ కు పంపగా.. ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రూ.2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని కేటీఆర్ ఆరోపించినట్లు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.