తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విద్యుత్ శాఖ, తాగునీటిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సమావేశమై.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడకుండా కరెంట్, తాగునీటిపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఎండలు ఎక్కువ కావడం, నీటి కోసం తిప్పలు ప్రజలు పడుతుండటంపై చర్చలు జరుపనున్నారు.