ప్రపంచంలో ఏడో వింతగా పేరొందిన తాజ్‌మహల్‌పై మరోసారి వివాదం నెలకొంది. తాజ్‌మహల్‌ను తేజో మహాలయగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ కోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. తాజ్‌మహల్‌ను తేజో మహాలయ (శివాలయం)గా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ ఈ దావా వేశారు.