“విజయా బ్యాంక్” లో ఉద్యోగాలు

“విజయా బ్యాంక్” లో ఉద్యోగాలు


విజయా బ్యాంక్.. ప్రధాన కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖల్లోని 67 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది..అయితే వీటిలో స్పెషలిస్ట్ కేడర్-57, క్లరికల్ కేడర్ (స్పోర్ట్స్ మెన్-10) పోస్టులకి దరఖాస్తులు కోరుతోంది..

ఖాళీలు: మేనేజర్-57 (అకౌంటెంట్-32+ లా-21+సెక్యూరిటీ-4); క్లర్క్-10 (క్రికెట్-4, బాస్కెట్ బాల్-4, కబడ్డీ-2).
వేతనశ్రేణి: మేనేజర్-రూ.31,705-రూ.45,950; క్లర్క్-రూ.11,765-రూ.31,540.
అర్హతలు: మేనేజర్‌కు సంబంధిత విభాగాలను బట్టి సీఏ/బీఎల్ (ఎల్‌ఎల్‌బీ)/ఏదైనా డిగ్రీ. అలాగే నిబంధనల మేర అనుభవం; క్లర్క్‌కు పురుషులు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియెట్/తత్సమాన విద్యలోఉత్తీర్ణత. సంబంధిత క్రీడాంశంలో అంతర్జాతీయ/జాతీయ/ రాష్ట్ర/జిల్లా/అంతర్ విశ్వవిద్యాలయాల స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ/ప్రాతినిథ్యం ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం.
వయసు: మేనేజర్ పోస్టుల్లోని లా, చార్టర్‌డ అకౌంటెంట్‌కు 35 ఏళ్లు, సెక్యూరిటీకి 45 ఏళ్లు మించకూడదు. క్లర్క్‌కు 18-28 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎంపిక: మేనేజర్‌కు రాతపరీక్ష/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ; క్లర్క్‌కు ఫీల్డ్ ట్రయల్స్.
దరఖాస్తు రుసుం: మేనేజర్‌కు రూ.600 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ-రూ.100); క్లర్క్‌కు రూ.300 (ఎస్సీ/ఎస్టీ-రూ.50).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, హార్డ్‌కాపీకి సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు జతచేసి పంపాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 27, 2018.
హార్డ్‌కాపీ చేరడానికి చివరి తేదీ: మే 4, 2018. 
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్ : www.vijayabank.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *