కరోనా వ్యాధితో మృతి చెందిన వారి నుంచి వైరస్ వ్యాపించదని, అలా మృతి చెందిన వారికి గౌరవంగా అంత్యక్రియలు చేయడానికి ప్రజలు సహకరించాలని కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, కోవిడ్ సలహా కమిటీ సభ్యులు, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలను శ్మశానవాటికకు దగ్గరగా ఉన్న స్థానికులు అడ్డుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఒక రోగి మృతి చెందిన తర్వాత హైపోక్లోరైడ్‌తో వైరస్ చనిపోయేటట్లు చేసి..ఒక సంచిలో మూసివేస్తారని తెలిపారు. ఆ తర్వాతే మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తారని పేర్కొన్నారు.