పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జిగా అభయ్ పాటిల్‌ను నియమించింది. తెలంగాణతో పాటు మొత్తం 13 రాష్ట్రాలకు ఇన్‌చార్జి, సహా ఇన్‌చార్జులను నియమించింది. ఈ మేరకు బుధవారం రాత్రి బీజేపీ కేంద్ర కార్యాలయం అధికార ప్రకటన విడుదల చేసింది. కాగా రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.