మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 1,439 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో, మంత్రి జూపల్లి కృష్ణారవు కొల్లాపూర్‌లో ఓటేయనున్నారు.