ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ పది అసెంబ్లీ, ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. బుధవారం పది అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో సీనియర్ బీజేపీ నేతల పేర్లు లేవు. సోమువీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి, మాధవ్ వంటి నేతలకు అవకాశం దక్కలేదు. బీజేపీలో చంద్రబాబుకు అనుకూలమన్న వ్యక్తులకే సీట్లు దక్కాయని నిజమైన బీజేపీ నేతలు మండిపడుతున్నట్లు సమాచారం.