శేఖర్ కమ్ముల దర్శకత్వం 2007లో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ రీరిలీజ్ కానుంది. ఈ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీని ఏప్రిల్ 12న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో బీటెక్ లైఫ్ ను ఆద్యంతం ఎంటర్టైన్ చేసే విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. కుర్రకారుకు ఈ సినిమా ఎంత నచ్చిందంటే.. చాలామంది ఈ సినిమా చూసి ఇంజనీరింగ్ చేద్దామని డిసైడ్ అయ్యేంతలా. యాక్టర్స్ పర్మార్మెన్స్, మిక్కీ మ్యూజిక్ ఈ మూవీకి హైలైట్.