రోజూ కష్టపడి తోపుడు బండిపై వ్యాపారం చేసుకుని సంపాదించిన సొమ్మును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేయటం అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)అన్నారు. చిరువ్యాపారి చెల్లబోయిన వీరరాఘవులు రూ. 20,700లను మంత్రి పేర్ని నానికి సోమవారం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తోపుడుబండిపై రోజువారీ వ్యాపారం చేసుకుంటూ చిట్టీ కట్టుకుంటూ కూడబెట్టిన సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కరోనా నియంత్రణ కార్యక్రమాలకు చేయూతగా విరాళం అందజేయటం జరిగిందన్నారు. పశి్చమగోదావరి డీసీసీబీ అధ్యక్షుడు కవురు శ్రీనివాసరావు పాల్గొన్నారు.