ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చెబితేనే చేశామని ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న తెలిపారు. 7 రోజుల విచారణలో ప్రణీత్‌రావు కీలక విషయాలు బయటపెట్టారు. 36 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులు, ప్రముఖ జ్యుయలరీ వ్యాపారులు, హవాలా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి, మాజీ మంత్రుల అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి చెదిరించినట్లు గుర్తించారు.