పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనలో పోలీసులు 55 మందిని అరెస్ట్ చేశారు. నరసాపురం డీఎస్పీ శ్రీనివాసరావు ఈ మేరకు వివరాలను వెల్లడించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రజిని కుమార్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన యువకుడిని విచారిస్తున్న సమయంలో కొంతమంది పోలీస్ స్టేషన్‌లో చొరబడ్డారు. స్టేషన్ అద్దాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి 55 మందిని అరెస్ట్ చేశామన్నారు.