ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. పక్షవాతరోగి నొలండ్ అర్బాగ్ మెదడులోని చిప్ సాయంతో మొదటిసారిగా ట్వీట్ చేశారు. ‘నన్ను రోబో అనుకొని ట్విట్టర్ నన్ను నిషేధించింది. మస్క్ తిరిగి నా ఖాతాను పునరుద్ధరించారు’ అని పోస్ట్ చేశారు. దానికి.. ‘న్యూరాలింక్ టెలీపతి పరికరాన్ని ఉపయోగించి, ఆలోచనలతో చేసిన మొట్టమొదటి పోస్ట్’ అని మస్క్ స్పందించారు.