టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఆమెకు నోటీసులు జారీ చేసింది. ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమం పేరుతో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఆమె చెక్కులు పంపిణీ చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు.