విశాఖ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరుసగా ఐదో రోజు సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రానుంది. అయితే డ్రై ఈస్ట్‌తో కలిపి డ్రగ్స్ రవాణా చేసినట్లు సమాచారం. 6 రకాల నిషేధిత సింథటిక్ డ్రగ్స్ అవశేషాలు గుర్తించినట్లు తెలుస్తోంది. శాంపిల్స్ సేకరించాక.. మరొక కంటైనర్‌లోకి డ్రగ్స్‌ను మార్చి సీబీఐ ప్రత్యేక సీల్ వేసింది.