టీడీపీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం కేశినేని మాట్లాడుతూ.. ‘ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకు అలవాటు. ఏబీ వెంకటేశ్వర రావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది చంద్రబాబే. గతంలో మోడీ.. చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయించాడు. ఇప్పుదే అదే మోడీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు మొదటి నుంచే ఎన్డీయేలో ఉన్నారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించండి.’ అని అన్నారు.