టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 18 మంది అభ్యర్థులపై ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఏడు స్థానాలకు పవన్ అధికారికంగా ప్రకటించారు. మరో 11 స్థానాలను ఆయా అభ్యర్థులను పిలిచి తెలిపారు. మరో మూడు స్థానాల్లో అభ్యర్థులు ఎవరో తేలాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు అభ్యర్థుల స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.