పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఇవాళ లేదా రేపు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర నాయకులు సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు సమచారం. టీడీపీలో పొత్తులో భాగంగా ఖమ్మం బరిలో నిలిపేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్ ఇప్పటికే నామాకు ఖమ్మం ఎంపీ టికెట్ ఖారారు చేసింది.