ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్‌..

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్‌ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు వీరిని అరెస్ట్‌ చేశారు. ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌ రావుతోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *