దక్షిణాఫ్రికాలో నిరసనలు
బ్రిటన్ పర్యటన మధ్యలోనే ఆపేసి స్వదేశానికి తిరిగి వచ్చిన అధ్యక్షుడు
జోహాన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో నిరస నలు వెల్లువెత్తాయి. నార్త్ వెస్ట్ ప్రావిన్స్ ప్రధాని సుప్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారు లు నిరసనలు చేపట్టారు. ఉద్యోగాలు కావాలని, మరింత మెరుగైన ఇండ్ల నిర్మాణం, రహదారులు, ఆస్పత్రులు కోసం కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసనకారులు ఓ బస్సును తగుల బెట్టారు. రోడ్లపై వెళ్తున వాహనాలపై రాళురువ్వారు. రహదారులు దిగ్బంధించారు. రోడ్లపై బైటాయించి నిరసన తెలిపారు. దక్షిణాఫ్రికాలో నిరసనలు భగ్గుమంటున్న నేపథ్యంలో అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా తన బ్రిటన్ పర్యటన కుదించుకుని స్వదేశానికి తిరిగివచ్చారు.
శాంతిభద్రతలకు విఘాతం కల్గించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.