బెర్లిన్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు లభ్యం

బెర్లిన్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు లభ్యం

బెర్లిన్‌: బెర్లిన్‌ నగరంలోని సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పేలని బాంబు వెలుగు చూసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాంబును చూసిన స్థానిక ప్రజలు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, బాంబు నిర్వీర్యం బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని బాంబును నిర్వీర్యం చేశారు. బాంబు వెలుగుచూసిన నేపథ్యంలోని నగరంలో రైళ్లు, ట్రామ్‌లు, బస్సులతో పాటు కొన్ని విమాన సర్వీసులను ఎక్కడికక్కడే నిలిపివేశారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..బెర్లిన్‌లో భవన నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్న సమయంలో దాదాపు 500 కిలోల బరువున్న ఈ బాంబు వెలుగుచూసింది. బాంబు లభించిన ప్రదేశం నుండి 800 మీటర్ల మేర నిర్జన ప్రదేశంగా ప్రకటించిన అధికారులు ఈ ప్రాంతంలో ఉన్న ప్రయాణీకులు, స్థానికులు, ఇతరులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. బెర్లిన్‌ నగర ఉత్తర భాగంలోవున్న సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ నుండి ప్రతి రోజూ దాదాపు మూడు లక్షల మందికి పైగా ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. బాంబు వెలుగు చూసిన ప్రదేశానికి సమీపంలోనే ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ నివాస భవనం, పార్లమెంట్‌ భవన సముదాయం కూడా ఉండటం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి దాదాపు 70 ఏండ్లు గడిచినప్పటికీ ఇప్పటికీ నగరంలో అక్కడక్కడ నాటి బాంబులు, వాటి అవశేషాలు బయటపడుతూనే ఉన్నాయి. గతంలోనూ బెర్లిన్‌ నగరంలో భారీ బాంబులు బయటపడ్డ సంగతి తెలిసిందే. 

బాంబులు బయటపడిన కొన్ని ఘటనలు : 
2017 మే: హనోవర్‌లో మూడు బ్రిటన్‌ బాంబులు కనిపించడంతో 50 వేల మందిని ఖాళీ చేయించారు.
2016 డిసెంబరు: ఆగ్స్‌బర్గ్‌లో 1.8 టన్నుల బరువైన బ్రిటన్‌ పేలుడు పదార్థం బయటపడటంతో 50 వేల మందికి పైగా ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు.
2012 జనవరి: యూస్కిర్‌చెన్‌లో తవ్వే సాధనం ఒకటి బాంబుకు తగలడంతో పేలుడు సంభవించింది. నిర్మాణ కార్మికుడు మృతి చెందారు.
2011 డిసెంబరు: కూబ్లెంజ్‌లో రైన్‌ నది గర్భంలో రెండు బాంబులు కనిపించడంతో దాదాపు 45 వేల మందిని ఖాళీ చేయించారు.
2010 జూన్‌: గోటిజెన్‌లో నిర్మాణ పనులు జరుగుతున్న చోట బయటపడ్డ బాంబును నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ముగ్గురు బాంబు నిర్వీర్యం సిబ్బంది చనిపోయారు.Q

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *