57 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేసింది. తెలంగాణలో ఐదు నియోజకవర్గాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేయనున్నారు. మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి పోటీ చేయనున్నారు.
ఇప్పటివరకు తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. మహబుబాబాద్ ఎంపీ స్థానాన్ని బాలరాం నాయక్‌కు కేటాయించగా.. మహబుబ్‌నగర్ నుంచి వంశీ చంద్ రెడ్డి, నల్గొండ నుంచి రఘవీర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్ పోటీ చేయనున్నారు.
ఇంకా భువనగిరి, ఖమ్మం, హైదరాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.