విజయవాడ: విజయవాడలో మానస సరోవర పిరమిడ్ క్షేత్రాన్ని దర్శించిన తెలంగాణ బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విజయవాడలో మానస సరోవర పిరమిడ్ క్షేత్రాన్ని రామ్ రెడ్డి గారు ఎంతో సుందర వందనంగా తీర్చిదిద్ది ప్రకృతి సిద్ధమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచి ధ్యానం యొక్క విలువను, పత్రీజీ గారి ఆశయాలను నేటి భావితరాలకు మార్గదర్శకాలుగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారని అందుకు మానస సరోవర పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ రామ్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మానస సరోవర పిరమిడ్ క్షేత్రాన్ని దర్శించిన తెలంగాణ బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన పరకాల నియోజకవర్గం ఇంచార్జ్ అబ్బా డి బుచ్చిరెడ్డి, అందోల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎర్రారం దేవదాస్, ఎల్లారెడ్డి నియోజకవర్గము ఇన్చార్జ్ పెద్ద గొల్ల జై కుమార్, కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది సాయి కృష్ణ యాదవ్ మరియు ప్రముఖ నాయకులు.