ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బుధవారం ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉన్నట్లు తెలుస్తోంది. భగవద్గీత పఠనం, భగవన్నామస్మరణ, ధ్యానం చేస్తున్నారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఉపవాసం కారణంగా ఆమె ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నారని పేర్కొన్నాయి. అంబేడ్కర్ జీవిత గాథ సహా పలు పుస్తకాలను అడిగి తెప్పించుకుని చదువుతున్నట్లు సమాచారం. కాగా ఇవాళ కవితను ఆమె తల్లి శోభ కలవనున్నారు.