అమెరికా మార్కెట్‌ః టెక్ షేర్ల నష్టాలు
అమెరికా మార్కెట్లు రాత్రి ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని సూచీలు నష్టాలు పొందాయి. అయితే టెక్ షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నాస్‌డాక్ ఒకశాతంపైగా 1.27 శాతం నష్టంతో ముగిసింది. డౌ జోన్స్30 సూచీ 0.82 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.85శాతం నష్టంతో ముగిశాయి. ఫ్యూచర్స్ లోనూ ఈ సూచీలు భారీ నష్టాలతో ట్రేడయ్యాయి. తైవాన్‌కు చెందిన టీఎస్ ఎంసీ కంపెనీ తన ఫలితాలు నిరాశజనంగా ఉండొచ్చని చెప్పడంతో యాపిల్ తో సహా పలు టెక్ కంపెనీల షేర్లు రెండు శాతం పైగా నష్టపోయాయి. శుక్రవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. షాంఘై, హాంగ్ సెంగ్ సూచీలు ఒకశాతం నష్టపోగా, ఇతర మార్కట్లలో పెద్ద మార్పులు లేవు. అలాగే యూరో మార్కెట్లు స్థిరంగా ట్రేడయ్యాయి. జర్మనీ డాక్స్ స్వల్పంగా నష్ట పోగా, ఇతర సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి.