ఎన్నికల వేళ కంటోన్మెంట్ లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి రెండో స్థానంలో నిలచిన ఎస్. శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహేశ్ గౌడ్ సమక్షంలో మంగళవారం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ సూచనతో కాంగ్రెస్ నేతలు గణేష్ తో చర్చలు జరిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని శ్రీ గణేష్ తెలిపారు.,