తొలిసారి సైనిక స్కూలులో బాలికలకు ప్రవేశం
దేశంలోనే మొట్టమొదటిసారి సైనిక్ స్కూలులో బాలికలకు కూడా ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. 57 ఏళ్ళ తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం దేశ భద్రతాదళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే బాలికల కలను సాకారం చేస్తుందని కల్నల్ అమిత్ చటర్జీ ప్రకటించారు. 15 మంది బాలికలను లక్నోలోని సైనిక స్కూలులో 9వతరగతిలో చేర్చుకునేందుకు మొట్టమొదటిసారి అవకాశం కల్పించారు. సైనిక స్కూలులో విద్యనభ్యసించడం తమకెంతో గర్వంగా ఉందని విద్యార్థినులు చెప్తున్నారు. దేశంలో మొత్తం 28 సైనిక స్కూళ్ళు, 5 మిలటరీ స్కూళ్ళు ఉన్నాయి.