తెలంగాణలో ఎన్నికల రోడ్ షోలకు సెలవు రోజుల్లోనే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఇతర సమయాల్లో నిషేధం లేకున్నా.. ప్రజలకు ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఆస్పత్రులు, ట్రామాకేర్, బ్లడ్ బ్యాంకులున్న ప్రాంతాల్లో రోడ్ షోలు చేపట్టవద్దన్నారు. 85 ఏళ్లు పైబడిన, దివ్యాంగ ఓటర్లు 7.2 లక్షల మందికి నామినేషన్ల ఉపసంహరణ పూర్తైన 4 రోజుల తర్వాత హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందన్నారు.