కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ఆయన ‘యూఏ: ది’ సినిమా చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపేంద్ర ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ సమయంలో భోజనానికి వెళ్లగా ప్రొడక్షన్‌కు చెందిన ఓ వ్యక్తి దారుణంగా అవమానించాడు. నేను హీరో అయ్యాక అతడే స్వయంగా భోజనం తీసుకొచ్చి ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చారు.