ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని.. ఆధారాలు లేవని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఈడీ డైరెక్టర్ ను చేర్చారు. లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. కాగా ఇవాళ రెండో రోజు ఈడీ కవితను ప్రశ్నించనున్నారు