ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ బీసీవై పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్న- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ బీసీవై పార్టీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ బీసీవై పార్టీ అట్టడుగు వర్గాల పార్టీ , ధనిక, పేద అనే భావం లేకుండా అందర్నీ సమానత్వంతో చూసే ఏకైక రాజకీయ పార్టీ బిసివై పార్టీ అని కొనియాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతం చేసేందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి గల్లీలో, వాడ వాడలో, రాష్ట్రంలోని 49 స్థానాల్లో గొంతు విప్పి ప్రచారం చేసిన పార్టీ బీసీవై పార్టీ అని తెలుపుతూ , తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా తెలంగాణ ప్రజల మనోభావాలను, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని ,తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడుతుందని ప్రజల పక్షాన ఉంటూ ప్రశ్నిస్తుందని, ప్రజా సమస్యలను తీరుస్తుందని, మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేశారు. తదన అనంతరం సమావేశంలో భాగంగా మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీసీవై పార్టీ అనుక్షణం, ప్రతిక్షణం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రజల కొరకు ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ యొక్క సమావేశంలో కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది సాయి కృష్ణ యాదవ్, హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ బాపు తిరుపతి, గోష్మహల్ ఇంచార్జ్ మేకల వివేక్ యాదవ్, ఎల్లారెడ్డి ఇంచార్జ్ పెద్ద గొల్ల జయకుమార్, తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన బీసీవై పార్టీ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *