వికారాబాద్ జిల్లా, మోమిన్పేట్ మండల్ బిజెపి ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి గారి ఏకైక పుత్రిక యాష్ణ రెడ్డి ప్రథమ జన్మదిన వేడుకలకు హాజరైన
బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పరమశివ మిత్రబృందంతో కలిసి అష్టాంగ మార్గాన్ని బోధించిన గౌతమ్ బుద్ధ చిత్రపటాన్ని బహుకరించారు. ఇట్టి తరుణంలో బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు మనం ఎలాంటి వాటిని దగ్గర చేస్తే వారి యొక్క మనసు అదేవిధంగా మారుతుందని , చిన్నపిల్లల మనస్తత్వాలు ఎదుగుతున్న మొక్కలాంటివన్నీ వారిని వటవృక్షాలుగా మార్చే బాధ్యత మన అందరిదని తెలియజేస్తూ జన్మదిన వేడుకలు అనే పదం జీవితంలో కీలకమైనటువంటి ఘట్టం ఇటువంటి జన్మదిన వేడుకలను ప్రతి ఒక్కరూ సంస్కృతి బద్ధంగా జరుపుకొని తల్లిదండ్రుల మరియు గురువుల ఆశీర్వాదం పొంది జీవితంలో గొప్ప ప్రయోజకులుగా మెదలాలని తెలియజేశారు. యాష్ణరెడ్డి గారి జన్మదిన వేడుకలకు ఆహ్వానించిన కుటుంబ సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క జన్మదిన వేడుకల్లో రాజ్ పుత్ క్షత్రియ మహాసభ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రభు సింగ్ ఠాగూర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి సంఘప్ప గౌడ్, కరాటే మాస్టర్ అశోక్ మరియు పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం ధ్యానులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.