కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఈ నెల 18న ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించగా మిగతా అభ్యర్థులను కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర నేతలకు ఈ విషయమై అధిష్టానం సమాచారం ఇచ్చిందని పేర్కొన్నాయి. జహీరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.