ఫోన్ ట్యాపింగ్, కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసులో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అంతర్గత విచారణలో ఆధారాలు లభ్యం కావడంతో మార్చి 4న ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో ప్రణీత్ రావు సిరిసిల్ల డీఎస్పీగా ఉన్నారు. సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో సిరిసిల్ల హెక్వార్టర్స్ ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో.. ప్రణీత్ రావు తన కుటుంబంతో సహా అక్కడే ఉన్నారు.
కాగా, మంగళవారం రాత్రి సిరిసిల్లలో ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు. జ్యూడీషియల్ కస్టడీ కోరుతూ కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, ఈ కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ ఏసీబీ వెంకటగిరి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
సస్పెన్షన్ ఆర్డర్లో కీలక విషయాలు
కాల్ట్యాపింగ్(ఫోన్ ట్యాపింగ్) వ్యవహారంలో సస్పెండ్అయిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్కుమార్రావు సస్పెన్షన్ఆర్డర్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా క్రైమ్‌రికార్డ్స్‌బ్యూరో డీఎస్పీగా పని చేస్తున్న ప్రణీత్‌రావు.. గతంలో హైదరాబాద్ఎస్ఐబీలో పని చేస్తున్న సమయంలో తన హోదాను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు పోలీసు శాఖ గుర్తించింది.
తన ఎస్ఓటీ బృందం కోసం హైదరాబాద్ఎస్ఐబీ కార్యాలయంలో ప్రత్యేక ఇంటర్నెట్‌సదుపాయాన్ని ప్రణీత్ఏర్పాటు చేసుకున్నట్లు సస్పెన్షన్ఆర్డర్లో పేర్కొన్నారు. ఈ తతంగమంతా అతనే నడిపినట్లు అధికారులు తేల్చారు. కంప్యూటర్లోని 42 హార్ట్డిస్క్లు కూడా మార్చినట్లు గుర్తించారు. పలువురి ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన కాల్డీటైల్రికార్డ్స్, ఐఎంఈఐ, ఇంటర్నెట్ప్రోటోకాల్రికార్డులను ప్రవీణ్డిలీట్చేశారు. ఎలక్ట్రీషియన్సాయంతో ఎస్ఐబీ భవనంలో సీసీ కెమెరాలు ఆఫ్చేయించి హార్ట్డిస్కులు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.