రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పేరుతో కొత్త కార్డులను ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోందిన సమాచారం. ఈ స్కీమ్ ప్రస్తుతం 1,670 రకాల చికిత్సలు అందుబాటులో ఉండగా, త్వరలో మరో 100 చికిత్సలను చేర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.