కరాటేమాస్టర్ అశోక్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

 

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు మిత్రబృందం ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ అశోక్ జన్మదిన వేడుకలు అమ్మ ఒడి హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరైన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ కరాటే మాస్టర్ అశోక్ ను శాలువాతో సన్మానించి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అభినందించారు. అదేవిధంగా సమ సమాజ పునర్నిర్మాణం కోసం నీ యొక్క ప్రతిభ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు కరాటే నేర్పించడం మరియు ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని వీళ్లే రేపటి దేశ రక్షకులుగా మారుతారని ఇట్టి బృహత్కార్యాన్ని చేపడుతున్న కరాటే మాస్టర్ అశోక్ గారికి మరియు వారి యొక్క గురువులకు జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా త్రికరణ శుద్ధితో అభినందనలు తెలియజేశారు. కరాటే మాస్టర్ లకు ఎప్పుడు చరిత్రలో గుర్తించదగ్గ వ్యక్తులుగా చరిత్ర చెప్పుకోవడానికి గర్వంగా భావితరాలు బాగుపడడానికి ఎప్పుడు వెన్నంటూ వెన్నెముకల కరాటే మాస్టర్ల వెంట ఉంటానని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ తన వంతు బాధ్యతగా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి సంఘప్ప గౌడ్, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ కూరెళ్ళ సదానంద్, మోమిన్పేట్ మండల్ బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి, బిజెపి నాయకులు పులి సాయి కిరణ్ గౌడ్ మరియు పరమశివ పిరమిడ్ కేంద్రం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *