నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాగర్ కర్నూలు జిల్లా కరాటే ఫెడరేషన్ ఆప్ ఫోటోకాన్ జిల్లా అధ్యక్షులు. కరాటే మాస్టర్ వి. వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రారంభమైన వేసవి కరాటే ప్రత్యేక శిక్షణ శిబిరం. విజయవంతంగా గత రెండు దశాబ్దాలుగా కరాటే శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం మాదిరిగానే వేసవి సెలవుల సందర్భంగా వేసవి కరాటే ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరం 45 రోజుల పాటు ప్రతిరోజు నిర్వహించబడుతుంది. ఉదయం 5 గంటల 45 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఇట్టి శిక్షణా శిబిరానికి ముఖ్యఅతిథిగా ఎడ్మ సత్యం. షోటోకాన్ కరాటే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కె.ఎల్.ఎన్. కన్నా మాస్టర్. కౌన్సిలర్ మబ్బు రామరాజు. మధు. మల్లేష్ యాదవ్. వివేకానంద. సాహెబ్. సమీర్. విద్యార్థుల తల్లిదండ్రులు కల్వకుర్తి లోని పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శిక్షణ శిబిరం లో దాదాపు 80 మంది విద్యార్థులు వారి పేర్లను నమోదు చేసుకుని శిక్షణలో ప్రవేశించారు.

