మేడ్చల్ జిల్లా కప్రా మండలం ఆదర్శనగర్ లో నెలనెల మాములు ఇవ్వాలని లేకపోతే అందరికి ఇదే గతి పడుతుందని హెచ్చరించడాని ఆరోపణ చేస్తున్న కార్మికులు. మీడియా ప్రతినిధులు అడిగిన ఫోన్ లో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. హైదరాబాద్ రోడ్లపై చెత్త తీసుకెళ్లే ఆటోలకు ఇదిలేదు, అదిలేదు అని 1000 నుండి 4000 వేల రూపాయలు వసూలు చేస్తున్నాడని, దాదాపు నెలకు 40 వేల నుండి 80 వేల వరకు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆటోలే మాకు జీవన ఆధారం, రోజు ఇలా ఇబ్బందులకు గురిచేసి టైర్ల లో గలితెస్తే మా బతుకులు ఎలా నడిచేది అని ఆవేదన వ్యక్తం చేస్తున్న కార్మికులు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి అవినీతి అధికారుల పై చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారుగా 40 నుండి 60 ఆటోల కార్మికులు ధర్నా చేసుతున్నారు.
